
రుద్రూర్: మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ డైరీలు, క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల ఇన్చార్జి గాండ్ల మధు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డౌర్ సాయిలు, రవి కిరణ్, బొట్టే గజేందర్, ఆర్. పోచయ్య, నీరడి సాయిలు, ఎస్. శేఖర్, శానం పోశెట్టి, సాయి కిరణ్, శంకరీ వీరన్న, అల్లఉద్దీన్, పార్వతి ప్రవీణ్, కర్రోళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
