పంక్షన్ హల్ వినియోగంలోకి తెస్తాం -ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో సామాగ్రి సమకూరుస్తాం
-రుద్రూర్ సర్పంచ్ సునీతచంద్రశేఖర్

రుద్రూర్:  మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఫంక్షన్ హాల్ ను వినియోగంలోకి తెస్తామని  గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీతచంద్రశేఖర్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ సిబ్బందితో పంక్షన్ హాల్ పరిసరాలను శుభ్రం చేయించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఇప్పటికి వరకు పంక్షన్ హల్ జీపీ ఆదీనంలో లేదన్నారు. జీపీ ఆధీనంలోకి తీసుకుని ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, మరికొంత దాతల ద్వారా విరాళాలు సేకరించి పంక్షన్ హలు అవసరమగు సౌకర్యాలు దశల వారీగా సమకూరుస్తామన్నారు. నిరుపేదలకు అందుబాటులోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.