నేడు శ్రీ దత్తాత్రేయ జయంతి

రుద్రూర్ (స్థానికం న్యూస్ ) : మండలంలోని గైని గుట్ట శ్రీ స్వయం భూబసవేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మద్యాహ్నం శ్రీ దత్తాత్రేయ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ అభివృద్ధి కమిటి సభ్యులు తెలిపారు. ఆలయ అర్చకులు పరమేశ్వర్ మహరాజ్ ఆధ్వర్యంలో జయంతి నిర్వహిస్తారని, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాల్సిందిగా వారు కోరారు.