విజయం కోసం ప్రణాళిక బద్ధంగా చదవాలి

శిక్షణ తరగతులను సందర్శించిన  సర్పంచ్
విద్యార్థులకు అల్పాహారం అందజేత
: మండల కేంద్రంలో  రైడ్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి విద్యార్థుల ఉచిత శిక్షణ తరగతులను రుద్రూర్ సర్పంచ్ ఇందూర్ సునీతచంద్రశేఖర్  సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ జీవితంలో విజయాన్ని సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా కష్టపడితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని కోరారు.
విద్యార్థుల అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రైడ్స్ సంస్థను అభినందించారు. అనంతరం సర్పంచ్ దంపతులు విద్యార్థులకు స్వీట్స్, అల్పాహారం పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ కర్క అశోక్, రైడ్స్ ప్రధాన కార్యదర్శి పార్వతి శేఖర్, సభ్యులు సాయికుమార్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.