
రుద్రూర్ : మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో గత ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. మహోత్సవాల చివరి రోజైన మంగళవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు, నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. కార్యక్రమంలో సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి నరోజీ గంగారాం, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, తోట సంగయ్య, గౌడ సంఘం అధ్యక్షుడు గుండూరి విట్టల్, సుధాకర్ గౌడ్ ,సతీష్ గౌడ్ ,ప్రశాంత్ గౌడ్ ,శ్రీకాంత్ గౌడ్ ,నగేష్ గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్, స్థానిక నాయకులు ,గౌడ సంఘం సభ్యులు, వి తదితరులు పాల్గొన్నారు.

