
కోటగిరి: సమస్యల పరిష్కారానికై ఐకెపి వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న స్వల్ప వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ వర్తింపు చేయాలని,cఅర్హులైన వివోఏ లకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, సాధారణ ,ఆరోగ్య భీమా సౌకర్యం రూ. 20 లక్షలు కల్పించాలని, ల 58వ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమ్మె కార్యక్రమంలో కోటగిరి ,పోతంగల్ మండలాలకు చెందిన వివోఏలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివో ఏ ల సంఘం మండల అధ్యక్షులు సాయిలు, ఉపాధ్యక్షులు శోభ, కార్యదర్శి రాజు, కోశాధికారి రమేష్, సహయ కార్యదర్శి శిరీష, ఉమ్మడి మండలాల ఐకెపి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
