ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు

కోటగిరి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కోటగిరి బస్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహం సమీపంలో కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు ఏముల నవీన్‌ మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ప్రధాని మోదీ చేస్తున్న కృషికి దేశ ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. అవినీతికి తావులేకుండా ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్న మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు వడ్ల శ్యామ్‌, దుబాష్‌ మహేశ్‌, మామిడి శ్రీనివాస్‌, సాయిలు, వడ్ల విఠల్‌, కమ్మరి వేణుగోపాల్‌, సీనియర్‌ నాయకులు మోహన్‌రావు, శ్యామల తోట శ్రీనివాస్‌, రుద్ర గజేంద్ర, లింగం సాయిలు, కోయిగూర్‌ సాయిలు, మేత్రి రాజు, కుమ్మరి నాని తదితరులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.