
రుద్రూర్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని బుధవారం గ్రామ సర్పంచ్ మచ్కురి రమేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కుటుంబ పెద్ద అకాల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించడం అభినందనీయమన్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న సంపాదనపరులకు ఈ పథకం వర్తిస్తుందని, బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. కుల, మత, ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. జిపి కార్యదర్శి గౌస్, వార్డు సభ్యులు కుర్మ రాజు, బేగరి గోపి, జెల్ల సాయిలు,పరమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు, తదితరులు ఉన్నారు
