

వర్ని: మండలంలోని జాకోర గ్రామంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గ్రామ చావడి వద్ద మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడి సందడి చేశారు.
తర్వాత బతుకమ్మలను ఊర చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అమావాస్య మరుసటి రోజు నిర్వహించే సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయని స్థానికులు తెలిపారు.
