కోటగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి : సర్పంచ్ మధుకర్

కోటగిరి :  కోటగిరి గ్రామపంచాయతీని ఆదర్శవంతంగా  తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకారాన్ని అందించాల్సిందిగా  గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్ కోరారు.  బుధవారం కోటగిరి జిపీ ఆవరణలో సర్పంచ్ మధుకర్  అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో  ఆయన మాట్లాడుతూ… గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామంలో శాంతిభద్రతలు, పరిశుభ్రత, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.  సభలో డిప్యూటీ తహసీల్దార్ మధు, ఎంపీడీవో విష్ణు, ట్రాన్స్కో  ఏఈ బుజ్జిబాబు, వ్యవసాయ శాఖాధికారి రాజు, విండో చైర్మన్ కూచి సిద్ధు, ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్,  జీపీ కార్యదర్శి సందీప్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.