నూతన అధ్యక్షులకు ఘన సన్మానం

కోటగిరి : ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా  నియమితుడైన పుల్కంటి కృష్ణ కుమార్ ను,  మండల జీపీ కార్యదర్శిల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన  ఉదయ్ భాస్కర్ ను సోమవారం కోటగిరి  గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోటగిరి సర్పంచ్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బర్ల మధుకర్ మాట్లాడుతూ… ఉమ్మడి కోటగిరి మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ఎన్నికైన కృష్ణకుమార్ కు, కోటగిరి మండల జిపి సెక్రెటరీల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఉదయభాస్కర్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి సమాజంలో పత్రికా రంగం లో పనిచేయడం అంటే కత్తి మీద సాములా ఉందని అలాంటి రంగంలో జర్నలిస్టుల ఉనికిని చాటుతూ జర్నలిస్టులకు గుర్తింపు తెచ్చేందుకు పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు సేవలను సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన కృష్ణ జర్నలిస్టుల సమస్యలపై నూతన అధ్యక్షుడు పోరాడాలని ఆకాంక్షించారు.  జిపి కార్యదర్శులమండల కార్యదర్శుల సంఘం  అధ్యక్షుడిగా ఎన్నికైన ఉదయభాస్కర్   కార్యదర్శుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు.  వీరిద్దరూ తమ పదవీకాలంలో కొత్త ఉత్సాహంతో మంచిగా పని చేసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో… జిపి సెక్రెటరీ సందీప్,ఉపసర్పంచ్ అలీనా తఫిన్, వార్డు మెంబర్లు మిర్ల సతీష్, పత్తి అబ్బయ్య, కన్నం శ్రీనివాస్, గగన్, అఫ్రొజ్, శైబాజ్ ఖాన్, సంధ్యారాణి,సాజిదా బేగం, లక్ష్మి, జిపి సిబ్బంది చిత్తరి సాయిలు,గంగామణి తదితరులు పాల్గొన్నారు.