

రుద్రూర్: మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిద్ధి వినాయకుడి మండపంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో గణపతి హోమం నిర్వహించారు. తొమ్మిదో రోజు ఉత్సవాల్లో భాగంగా వినాయకుడిని మోదకాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మండపానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
