వైభవంగా వినాయకుని శోభాయాత్ర

రుద్రూర్‌: మండల కేంద్రంలోని సార్వజనిక్‌ గణేష్‌ మండలి, శ్రీ లక్ష్మి గణపతి ఆలయ గణేష్ మండలి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వైభవంగా కొనసాగింది.  మహిళల కోలాటాలు, బాలికల నృత్యాలు, సంప్రదాయ కళారూపాలు, భజన సంకీర్తనలతో ప్రధాన వీధులు సందడిగా మారాయి. భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో ఉత్సాహంగా ముందుకు సాగారు. శోభయాత్రలో ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో శోభ యాత్రలో పాల్గొన్నారు. 

శ్రీ సార్వజనిక్ గణేశుని గాంధీచౌక్ వద్ద, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వినాయకుని శోభయాత్ర అంగడి బజార్ లో తాత్కాలికంగా నిలిపివేస్తారు. రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు తిలకించడానికి సమీప గ్రామాల నుండి వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.