నిత్యవసర సరుకుల అందజేత

రుద్రూర్ : మండల కేంద్రంలోని జవహర్ నగర్  కాలనీలో ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల  కోటగిరి లింగవ్వకు చెందిన ఇల్లు కురుస్తూ  వరద నీటితో ఇబ్బందికరంగా మారింది. ఈ విషయాన్ని  స్థానిక బిజెపి నాయకుల ద్వారా  తెలుసుకున్న బాన్సువాడ సెగ్మెంట్ బిజెపి నాయకులు, ఎన్ ఆర్ ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి ఇంటిపైన కప్పుకోవడానికి తాడిపత్రి  నిత్యవసర సరుకులు పంపించారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శులు ఎముల గజేందర్ , వడ్ల  సాయినాథ్, ఉపాధ్యక్షులు యం వి . కృష్ణంరాజు,  బేగరి వినోద్ కుమార్, నాయకులు బోజిగొండ అనిల్, కోశాధికారి వి. రామరాజు,
బీజేవైఎం మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్,
మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.