కోటగిరి : కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని దేవునిగుట్ట తండా లో మంగళవారం యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ యువకులకు బ్యాట్లు, బాల్స్, స్టంప్స్ తదితర క్రీడా సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా దేవునిగుట్ట తండాకు చెందిన ఏముల నవీన్ మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెరగడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరచూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీతారాం నాయక్, ఏముల నవీన్, పత్తి సతీష్, కప్ప సాయిలు, హరి కృష్ణతో పాటు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

