ముస్లిం మైనార్టీ విలేజ్ కమిటీ ఎన్నిక

రుద్రూర్ : ముస్లిం మైనార్టీల అభివృద్ధి కొరకే  ముస్లిం మైనార్టీల కమిటీని ఏర్పాటు చేసినట్టు కమిటీ అధ్యక్షులు సయ్యద్ ముల్తాని, ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తెలిపారు. సోమవారం వారు కమిటీ వివరాలు వెల్లడించారు. అధ్యక్షులుగా సయ్యద్ ముల్తాని, ఉపాధ్యక్షులుగా ఇమ్రాన్ ఖురేషి, ఖలీమ్ ఖురేషి, ప్రధాన కార్యదర్శిగా షేక్ సుభాని, సంయుక్త కార్యదర్శిగా ఖాజా కురేషి, కోశాధికారిగా మొహమ్మద్ ఇక్రమ్, సభ్యులుగా    షేక్ సిరాజ్, శామీర్ కురేషి, ఎండి జమీల్, సయ్యద్ రహీం, షేక్ ఇలియాస్, షేక్ జాకీర్  తెలిపారు. దేశంలో అత్యంత పేదరికంలో ముస్లిం సమాజం జీవిస్తుందని,నిజజీవితంలో పూట గడువక కటిక పేదరికంలో మగ్గుతున్న ముస్లిం, ఇతర మైనారిటీల హకుల సాధన కోసం, ముస్లిం సమాజం అభివృద్ధి కోసం పోరాడనున్నట్టు పేర్కొన్నారు..