

రుద్రూర్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గణేష్ మండపాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రూర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలోని నవయుగ గణేష్ మండలిలో వినాయకుడిని దూది వస్త్రంతో అలంకరించారు. సార్వజనిక్ గణేష్ మండలిలో స్వామివారిని గరికతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
ఇందూర్ గణేష్ మండలి, శ్రీకృష్ణ గణేష్ మండలి, వశిష్ట గణేష్ మండలి, చిక్కడపల్లి శివపుత్ర గణేష్ మండళ్ల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
గణపతికి గరికతో పూజ శ్రేష్ఠం
రుద్రూర్: గణపతికి గరికతో పూజ చేయడం ఎంతో శ్రేష్ఠమైనదని పిట్ల కృష్ణ మహారాజ్ అన్నారు. మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ మండపంలో ఆదివారం భక్తులకు ప్రవచనం ఇచ్చారు. గణపతి పూజలో గరికకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. గణపతికి గరిక సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు.
గణపతి తొండం ప్రత్యేకతను కూడా వివరించారు. గణేశుడి రూపంలోని ప్రతి అంశానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని చెప్పారు. భక్తిశ్రద్ధలతో గణపతిని పూజించడంతో పాటు ఆయన తత్వాన్ని ఆచరించాలని సూచించారు. ప్రవచనాన్ని భక్తులు ఆసక్తిగా విన్నారు.


