శాకంబరీ ఆలంకరణలో గణేషులు

రుద్రూర్: మండల కేంద్రంలోని సార్వజనికక్ గణేషున్ని, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలోని  నవయుగ గణేష్ మండలి వినాయకున్ని శనివారం శాకంబరీ ఆలంకరణ చేశారు. వివిధ రకాల కూరగాయలతో  ఆకర్షణీయంగా ఆలంకరించారు.  సార్వజనిక్ గణేష్ మండపం వద్ద బ్రహ్మర్షి మేఘనాధ్ శర్మ భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనం అందజేశారు. భక్తులు  ప్రత్యేక పూజలు నిర్వహించారు.