హెడ్ పోస్టాఫీస్ మంజూరు చేయాలి


బాన్సువాడ: బాన్సువాడ పట్టణానికి హెడ్ పోస్టాఫీస్ మంజూరు చేయాలని కోరుతూ బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, ఎన్‌ఆర్‌ఐ కోనేరు శశాంక్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్, పోస్టల్ శాఖ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాన్సువాడకు హెడ్ పోస్టాఫీస్ అవసరం, ప్రజలకు కలిగే ప్రయోజనాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, బాన్సువాడకు హెడ్ పోస్టాఫీస్ మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు శశాంక్ తెలిపారు. హెడ్ పోస్టాఫీస్ ఏర్పాటుతో బాన్సువాడ ప్రాంత ప్రజలకు పోస్టల్ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.