ఘనంగా కోనేరు శశాంక్‌ జన్మదిన వేడుకలు

రుద్రూర్‌: భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, ఎన్నారై కోనేరు శశాంక్‌ జన్మదిన వేడుకలను శుక్రవారం రుద్రూర్‌ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి శశాంక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ గూడూరి ప్రశాంత్‌ గౌడ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, బేగరి వినోద్‌కుమార్‌, బోజిగొండ అనిల్‌, విజయ్‌, మండల ప్రధాన కార్యదర్శులు ఏముల గజేందర్‌, వడ్ల సాయినాథ్‌, మండల సీనియర్‌ నాయకులు వి. రామరాజు, బీవీ గుప్తా, చిదుర మహిపాల్‌, పార్వతి మురళి,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.