
రుద్రూర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత ఐక్య వేదిక మండల అధ్యక్షుడు బేగరి నవీన్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఐ కృష్ణ కు ఫిర్యాదు చేశారు. అనంతరం నవీన్ మాట్లాడుతూ…అంబేడ్కర్‌పై అసత్యాలు, కల్పిత అంశాలతో కూడిన ‘కల్పిత నాయకుడు’ అనే పుస్తకాన్ని రచించి విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో దళిత ఐక్యవేదిక ప్రతినిధులు బి .సంజీవ్, కిశోర్, సాయిలు, కృష్ణ, శివ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
