

రుద్రూర్ : మండల కేంద్రంలో ఆగస్టు 2న నిర్వహించనున్న బోనాల మహోత్సవానికి హాజరుకావాలని గ్రామ పెద్దలు బుధవారం పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వానించారు. గ్రామ వతన్దార్ వెంకటేశ్వరరావు దేశాయ్, గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీతచంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పి. సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఎండెల లక్ష్మీనారాయణ ను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిసి బోనాల పండుగకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బోనాల వేడుకలను గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.


