ఘనంగా ఇందూర్ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు
– లయన్స్ ఆసుపత్రిలో అన్నప్రసాద వితరణ


బోధన్,అక్టోబర్ 26: రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, లయన్ ఇందూర్ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తన పుట్టినరోజును కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, సేవా కార్యక్రమాల ద్వారా ఆదర్శంగా నిలిచారు.
బోధన్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులు, వారి సహాయకులు అలాగే దినచర్య ఓపీ (OP) సేవలకు వచ్చిన రోగుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన పేదలకు కడుపు నిండా భోజనం వడ్డించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు గుండూరు ప్రశాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జన్మదినాన్ని పురస్కరించుకుని సమాజంలోని పేద రోగుల ఆకలి తీర్చే ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. భగవంతుడు లయన్ ఇందూర్ చంద్రశేఖర్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు, మరిన్ని ఉన్నత విజయాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జి.ఎస్.టి కోఆర్డినేటర్ శ్యాంసుందర్ పహాడే, జిల్లా చైర్మన్ కె.వి. మోహన్, క్లబ్ కోశాధికారి పార్వతీ ప్రశాంత్, డైరెక్టర్ పుట్టి సాగర్, దుర్గాదేవి కమిటీ అధ్యక్షులు ఇందూర్ కార్తీక్, రుద్రూర్ గ్రామ వార్డు సభ్యులు ఆమంద్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొని చంద్రశేఖర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వారు కూడా స్వయంగా పాల్గొని రోగులకు భోజనాలు వడ్డించారు.
